Abhimanyu, Anaadrushyu, Aswaddhaama- పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు

Abhimanyu, Anaadrushyu, Aswaddhaama- పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు
April 30, 2015 Comments Off on Abhimanyu, Anaadrushyu, Aswaddhaama- పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు Hindu IT Support KCH Jobs
పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు — క్లుప్తముగా వాటి వివరాలు

Abhimanyu, Anaadrushyu, Aswaddhaama- పురాణాలలో కొన్ని ముఖ్యమైన పేర్లు

Abhimanyu : అభిమన్యుడు — 

అర్జునుడు – సుభద్రల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు .

అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు….. 

యధిష్టురుని తరువాత హస్తినాపురానికి (పరీక్షిత్తు) రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది.

Anaadrushyu : అనాదృష్యుడు —

 గాంధారీ , ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు .

Aswaddhaama : అశ్వత్థామ – 

గుర్రము వలె సామర్ధ్యము / బలము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి .


About The Author