Sindhuram bottu పాపిట నడుమ ధరించే సింధూరానికి అర్థమేమిటి?
devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus
Sindhuram bottu
పాపిట నడుమ ధరించే సింధూరానికి అర్థమేమిటి?
పాపిట నడుమ ధరించే సిందూరం పెళ్ళయిందని చెప్పడానికి ప్రధాన సూచిక. మేష భగవానుడు అంగారకుడు. అతని రంగు ఎరుపు. ఇది చాలా శుభప్రదమైదని భావిస్తారు. అందువల్లనే ఎర్రని సిందూరాన్ని నుదుటిపైన, పాపిట మధ్యలో ధరిస్తారు. ఈ రెండూ సౌభాగ్య చిహ్నాలే. పార్వతి, సతీల స్త్రీశక్తి చిహ్నంగా కూడా పరిగణిస్తారు. ఎర్రనిరంగు ఆమె ప్రవేశంతో సంపదలను చేకూర్చుతుందని స్త్రీ ధరించే సిందూరం కుటుంబ సంక్షేమాన్ని, సంతాన్ని పరిరక్షిస్తుందని పండితులు అంటున్నారు.
బొట్టు స్త్రీ శక్తికి నిదర్శనం స్త్రీని, ఆమె భర్తను పరిరక్షిస్తుందని విశ్వసిస్తారు. బొట్టు పెట్టుకునే చోట మూడో నేత్రం ఉంటుంది. ఇది ప్రధాన నాడీ కేంద్రం. అనుభవాలన్నీ కలగలిపి ఒకచోట కేంద్రీకరించే బిందువు ఇది. ఈ ప్రదేశానికి చల్లని ప్రభావం ఉంటుంది. బొట్టు ఆధ్యాత్మిక సౌకర్యాన్ని చేకూర్చి పెట్టడమే కాకుండా దురదృష్టం, దుష్టశక్తులు దరిచేరకుండా ఈ బొట్టు పరిరక్షిస్తుందని విశ్వాసం.devotional, islam, quran, hindu, ramayan, bhagavad gita, telugu bhagavad gita, bhagavad geetha, telugu bhagavad geetha, bible, christian, muslim, yoga, meditation, health, knowledge base 2 u , telugu quran, telugu bible , slokam, telugu bhakti, prayer, devudu, temple, church, masjeed, jesus