Yoga యోగా … Yoga – యోగా 2

Yoga యోగా … Yoga – యోగా 2
June 2, 2015 Comments Off on Yoga యోగా … Yoga – యోగా 2 Health & Yoga IT Support KCH Jobs
Yoga యోగా … Yoga – యోగా 2
వజ్రాసనము (సంస్కృతం:

वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో ‘వజ్ర’ అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.

క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.


తొలుత సుఖాసన స్థితిని పొందాలి


 నిటారుగా కూర్చోవాలి.


రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.

ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.

వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.

పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.

మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.

పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.

వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.

అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.

రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.

తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.

వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.

భుజంగాసనము (సంస్కృతం:

भुजङ्गसन) యోగాలో ఒక విధమైన ఆసనము. సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని అర్థం. ఈ ఆసనం వేసినప్పుడు శరీరం పడగ ఎత్తిన పాము వలె ఉంటుంది కనుక దీనిని భుజంగాసనమని పేరువచ్చింది. భుజంగాసనం చాలా సులువైన వ్యాయామ రీతిగా చెప్పవచ్చు. అయితే, దీంట్లో తప్పులు కూడా సునాయాసంగానే చేసే అవకాశముంది. కాబట్టి ఈ ఆసనం ద్వారా గరిష్ట ప్రయోజనాలు పొందడానికి గాను దీని గురించిన వివరాల పట్ల శ్రద్ధ వహించాలి.

విరామ స్థితిలో ఉన్నప్పుడు, నింపాదిగా ఈ భుజంగాసనాన్ని ప్రయత్నిస్తే మంచిది. ఈ ఆసనం వేసేటప్పుడు మీ వెన్నెముక కండరాలు ఒత్తిడికి గురికారాదు. అలాగే ఆసనాన్ని త్వరత్వరగాను, ఉన్నట్లుండి కూడా వేయడానికి ప్రయత్నించరాదు. భుజంగాసనాన్ని శలభాసనము, ధనురాసనాలతో కలిపి వేయాలి, ఈ మూడు ఆసనాలు కలిపి త్రయంగా ఏర్పడతాయి.ఈ మూడు ఆసనాలూ పరస్పరం అనుసంధానమై ఉంటాయి. భుజంగాసనానికి వ్యతిరేక భంగిమలు హలాసనంగా, పశ్చిమోత్తాసనంగా రూపు దాలుస్తాయి.
బోర్లా పడుకొని రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి నేలమీద ఆనించాలి.
రెండు చేతులను ఛాతీకి దగ్గరగా నేలమీద ఉంచాలి.
కొద్దిగా శ్వాస పీల్చి, తలపైకి ఎత్తి నడుమును వెనుకకు వీలైనంత వరకు వంచాలి.
కొద్ధి క్షణాలు తరువాత మెల్లగా తలను నేలపై ఆనించాలి.
కొద్ది క్షణాలు మకరాసనంలో విశ్రాంతి తీసుకోవాలి.
రుతుక్రమం సకాలంలో రాకుండా బాధపడుతున్న మహిళలకు భుజంగాసనం ప్రత్యేకించి లబ్ది చేకూరుస్తుంది.


అండాశయం మరియు మూత్రాశయానికి సంబంధించిన పలు సమస్యలను ఇది నివారిస్తుంది.
గర్భసంచిని, చుట్టుపక్కల ఉన్న కటి ప్రాంతాలను ఇది క్రమబద్ధంగా పనిచేసేలా చూస్తుంది. పొత్తి కడుపు భాగంలో ఒత్తిడిని పెంచడం ద్వారా ఇది జరుగుతుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు సైతం ఈ ఆసనం వేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.స్వల్ప రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే భుజంగాసనాన్ని తప్పక వేసి మంచి ఫలితాలు పొందవచ్చు.


పెద్దప్రేగు మరియు పొట్టలోని వాయువును భుజంగాసనం వెలుపలకు నెడుతుంది.
మెడ, వీపుకు సంబంధించిన అన్నిరకాల నొప్పులకు భుజంగాసనం దివ్యంగా పనిచేస్తుంది.


శ్వాసకోశ వ్యాధుల నివారణకు భుజంగాసనం మంచి మేలు చేస్తుంది. ఈ ఆసనం ఎలా వేయాలో తెలుసుకుందాం.

ప్రశాంతమైన గదిలో ఒక మెత్తని దుప్పటి పరుచుకోవాలి. దానిపై నెమ్మదిగా బోర్లా పడుకోవాలి. గడ్డాన్ని నేలకు ఆనించి ఉంచి చేతులను ఛాతీ ప్రక్కన అరచేతులు ఆని ఉండేటట్లుగా మోచేతులు పైకి ఉండేటట్లు ఏర్పరుచుకోవాలి.
బారుగా చాపిన పాదాలు ఒకదానికొకటి ఆని ఉండేటట్లు ఉంచుకోవాలి. అనంతరం నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ బరువును అరచేతులపై ఉంచి ఛాతీని తద్వారా మెడను బాగా పైకి లేపాలి.

తలను బాగా పైకెత్తి పైకి ఆకాశం వంక చూస్తున్నట్లు ఉంచుకోవాలి. ఈ భంగిమలో వెన్ను చక్కగా అర్థచంద్రాకారంలాగా వెనుకకు వంగి ఉంటుంది. ఇలా ఎవరి అవకాశాన్ని బట్టి వారు ఛాతీని పైకి లేపాలి.

లేదంటే బొడ్డును కొలమానంగా ఉంచుకుని నాభి వరకూ నడుము నుంచి పొట్ట, ఛాతీ లేపాలి. ఈ సమయంలో చేతులను నిటారుగా లేపి ఉంచేకంటే కొంచెం వంచి ఉంచడం మంచిది. ఇలా చెయ్యడం వలన భుజాలు, చేతులు కూడా శక్తివంతమవుతాయి.

ఇది సర్పం శిరస్సు లేపి పడగ విప్పి ఆడినట్లు ఉంటుంది కాబట్టి భుజంగాసనం అన్నారు. దీనిలో శ్వాస నియమం శరీర భాగాలు విప్పారుతాయి. కాబట్టి శ్వాస తీసుకుంటూ భంగిమకు వచ్చి పూర్ణస్థితిలో ఉండాలి. ఇలా ఉండగలిగినంతసేపు ఉండవచ్చు.

సౌజన్యం: శిల్పయోగా


ఈ విధంగా ఈ ఆసనాన్ని మూడునాలుగుసార్లు చేయవచ్చు. అనంతరం రెండు భుజాల మీద అంటే కుడి భుజము మీద ఎడమ చేతిని ఎడమ భుజము మీద కుడిచేతిని ఉంచి దానిపై గడ్డాన్ని ఉంచి విశ్రాంతిని తీసుకోవాలి.
దీన్ని ఎవరెవరు చెయ్యకూడదు…?

గర్భం ధరించిన స్త్రీలు ఈ ఆసనాన్ని వేయకూడదు. పొట్టకు వత్తిడి తగిలేది కనుక వేయరాదు. అలాగే వెన్నుకు సంబంధించి ఏవైనా ఇంజెక్షన్లు, ఆపరేషన్లు వంటివేవైనా జరిగినవారు కూడా చేయకూడదు. మిగిలినవారు స్త్రీ, పురుషులు చిన్నపిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వరకూ ఎవరైనా ఈ ఆసనాన్ని వేయవచ్చు.
ఉపయోగాలు…

ఈ ఆసనం వల్ల గొంతు దగ్గర ఉండే థైరాయిడ్ కు మంచి ప్రయోజనం కలుగుతుంది. సర్వైకిల్ స్పాండిలైటిస్ అనే మెడకు సంబంధించిన వ్యాధి రాకుండా ఉంటుంది. వచ్చినా తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు వ్యాకోచం చెంది శ్వాస బాగా ఆడటం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులను నిరోధించవచ్చు.శరీరం చాలా శక్తివంతంగా మారుతుంది. వెన్నుగా బాగా శక్తి వచ్చి వెన్నులోని డిస్కుల సమస్యలు తగ్గుతాయి. బొడ్డు వరకూ బాగా లేపి సాధన చేయడం వల్ల పొట్ట కండరాలన్నీ వ్యాకోచం చెంది అక్కడి అవయవాలు, జీర్ణాశయం చురుగ్గా పనిచేస్తాయి.

Bhujangasana (/ˈbuː.dʒænˈɡɑː.sɑː.nɑː/;[1] Sanskrit: भुजङ्गासन; IAST: Bhujaṅgāsana) or Cobra Pose[2] is an asana. Bhujangasana may strengthen the spine, stretch the chest, shoulders, and abdomen, firm the buttocks, and relieve stress and fatigue. Traditional texts say that Bhujangasana increases body heat, destroys disease, and awakens kundalini. 

 Cautions Common postural errors during this asana include overarching the neck and lower back. One recommendation is to keep the gaze directed down at the floor and focus on bringing movement into the area between the shoulder blades (the thoracic area, or middle back).[3] – Bhujangasana is often followed by Salabhasana. In Surya Namaskar, it precedes Adho Mukha Svanasana.Tags
About The Author